హైదరాబాద్, ఫిబ్రవరి 14: నాట్కో ఫార్మా లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. మూడో త్రైమాసికంలో సంస్థ రూ.212.7 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.62.3 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.758.6 కోట్లకు చేరుకున్నది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.25 మూడో మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది.