హైదరాబాద్, జూలై 23: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా.. వ్యాపార విస్తరణలో భాగంగా దక్షిణాఫ్రికాకు చెందిన యాడ్‌కాక్ ఇంగ్రామ్ హోల్డింగ్స్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయబోతున్నది. రూ.2 వేల కోట్లతో 35.75 శాతం వాటాను హస్తగతం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నది.
విదేశాల్లో ఉన్న వ్యాపారంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు, అవసరమైతే కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని ఇటీవల వ్యాఖ్యానించారు.