జోహెన్స్‌బర్గ్, అక్టోబర్ 11: దక్షిణాఫ్రికాకు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ అడ్కాక్ ఇంగ్రామ్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది నాట్కో ఫార్మా. ఒప్పందం విలువ రూ.420 కోట్లు. మెజార్టీ వాటాదారులుగా నాట్కోతోపాటు బిడ్వెస్ట్ ఉండనున్నాయి. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి జూలై నుంచి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతుండగా ఇప్పడు కొలిక్కివచ్చాయి.
ఈ విషయాన్ని జోహెన్స్‌బర్గ్ సెక్యూరిటీ ఎక్సేంజ్‌కు సంస్థ సమాచారం ఇవ్వడంతో అడ్కాక్ షేరు ధర 20 శాతం ఎగబాకింది.