కొనుగోళ్లపై నాట్కో దృష్టి
హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యాకలాపాలు అందిస్తున్న నాట్కో ఫార్మా ఇతర సంస్థలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రెండు నుంచి మూడు చిన్న స్థాయి సంస్థలను కొనుగోలు చేయాలనుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించింది.
ఇందుకోసం ఎంత మొత్తం నిధులను వెచ్చించనున్నదో మాత్రం వెల్లడించలేదు. కాన్ఫరెన్స్ కాల్లో కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని మాట్లాడుతూ..ఈ ఏడాది ఆర్అండ్డీ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు, విదేశాల్లో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గడిచిన రెండేండ్లుగా భారత్లో కంపెనీ వ్యాపారం ఆశావాదంగా ఉన్నదని, గతేడాది రూ.400 కోట్ల విక్రయాలు జరిపినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఆంకాలజీ చికిత్సకోసం వినియోగించే ఔషధాలకు డిమాండ్ పెరిగిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,043.80 కోట్ల ఆదాయంపై రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కరోనా ఉత్పత్తుల కోసం రూ.232 కోట్ల నిధులను వెచ్చించడంతో లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

