న్యూఢిల్లీ, నవంబర్ 25: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తికి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ కాటమారన్ తన పెట్టుబడుల పరిమితిని మరిన్ని రంగాలకు విస్తరించబోతున్నది. తయారీ కంపెనీలకు సంబంధించిన స్టార్టప్‌ల్లో సైతం పెట్టుబడులు పెట్టేయోచనలో ఉన్నట్టు కంపెనీ చైర్మన్ ఎండీ రంగనాథ్ తెలిపారు.
మంచి ఆలోచనలు, మంచి వ్యాపార మాడళ్లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయన్నారు. ఇప్పటికే సంస్థ స్పేస్ ఎక్స్, డీప్-టెక్ ఎనర్జీ, లాగ్ 8, బీ2బీ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్, ఎడ్యుటెక్ ఉడేమీ వంటి స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టారు.