e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Nilekani on Cryptos | క్రిప్టో క‌రెన్సీల‌పై ఇన్పీ చైర్మ‌న్ నంద‌న్ నిలేక‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Nilekani on Cryptos | క్రిప్టో క‌రెన్సీల‌పై ఇన్పీ చైర్మ‌న్ నంద‌న్ నిలేక‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Nilekani on Cryptos | క్రిప్టో క‌రెన్సీల‌పై ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నంద‌న్ నిలేక‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాటిని దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అంత‌ర్భాగం చేయాల‌ని సూచించారు. క్రిప్టో క‌రెన్సీల‌ను అసెట్స్‌గా ప‌రిగ‌ణించాల‌ని, అయితే, వాటిల్లో పెట్టుబ‌డులు పెట్టే వారు చ‌ట్టాల‌ను అనుస‌రించాల‌ని పేర్కొన్నారు. కానీ తెర వెనుక మ‌నీ లాండ‌రింగ్‌కు క్రిప్టో క‌రెన్సీల‌కు చోటు క‌ల్పించొద్ద‌ని సూచించారు. క్రిప్టోల‌ను ఫైనాన్సియ‌ల్ మార్కెట్లోకి యువ‌త‌రం ప్ర‌వేశించ‌డానికి ఎంట్రీ పాయింట్లుగా ప‌రిగ‌ణించాల‌ని చెప్పారు.

దేశంలో క్రిప్టో క‌రెన్సీల భ‌విత‌వ్యంపై అనిశ్చితి నెల‌కొన్న నేప‌థ్యంలో నంద‌న్ నిలేక‌ని వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం ల‌భించిన వెంట‌నే క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ బిల్లును పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తామ‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

అన్ని ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీల‌పై నిషేధం విధిస్తామ‌ని, అదే స‌మ‌యంలో బ్లాక్ చైన్ టెక్నాల‌జీ, దాని ఉప‌యోగాన్నిప్రోత్స‌హించ‌డానికి కొన్ని మిన‌హాయింపులు ఇస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. 2019లో రూపొందించిన ముసాయిదా బిల్లు స్థానే కొత్త బిల్లును కేంద్రం తీసుకు రానున్న‌ది. 2019 బిల్లుతో పోలిస్తే 2021 బిల్లులో కొన్ని మార్పులు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Mehendi Blouse : చీర క‌ట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజ‌న్లు చూసి షాక్

వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువ‌తి బంప‌ర్ ఆఫ‌ర్.. ఎక్క‌డో తెలుసా?

jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకుని ఏం చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఇదే నా జ‌వాబు

3 అడుగుల వ‌రుడు.. 2 అడుగుల వ‌ధువు.. 7 అడుగుల బంధం

అరుదైన‌ రెండు త‌ల‌ల బ‌ల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు.. వైర‌ల్ వీడియో

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement