న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వీ అనంత్ నాగేశ్వరన్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. మూడేండ్లు పదవీ కాలం ముగిసిన మీదట 2021 డిసెంబర్లో సీఈఏగా వైదొలిగిన కేవీ సుబ్రమణియన్ స్థానంలో నియమితులైన నాగేశ్వరన్ గతంలో క్రెడిట్ సూసీ గ్రూప్, జూలియస్ బేర్ గ్రూప్‌ల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2021-22 సంవత్సరానికి ఆర్థిక సర్వేను రెండ్రోజుల్లో విడుదల చేయనున్న
నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.