హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్)కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)ను కోరారు. నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పలు విజ్ఞప్తులు చేశారు.
మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో గోదాములు, రైస్ మిల్లుల ఏర్పాటుకు, రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని సీఎంకు నాబార్డు చైర్మన్ ప్రతిపాదించారు.