న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: డిబెంచర్లను జారీ చేయడంతో రూ.360 కోట్ల నిధులను సేకరించనున్నట్లు ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈష్యూ ఈ నెల 25న ముగియనున్నదని తెలిపింది. సంస్థ ఇలా నిధులను సేకరించడం ఇది 16వ సారి కావడం విశేషం. సెక్యూర్డ్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయనుండటంతో కనీసంగా రూ.360 కోట్లు, గరిష్ఠంగా రూ.1,100 కోట్లు సేకరించాలని సంకల్పించింది. ఈ ఎన్సీడీల కాలపరిమితి 26 నెలలు, 38 నెలలు, 60 నెలలు, 72 నెలలు, 94 నెలలతో మెచ్యూరిటీ పొందనున్నాయి.