Mukesh Ambani | అదానీని దాటేసిన అంబానీ.. మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా ముకేశ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా అవతరించారు. 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నారని ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాదికాలంలో ముకేశ్ సంపాదన 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.
- 108 బిలియన్ డాలర్లతో దేశీయ శ్రీమంతుడు
- ఫోర్బ్స్ సంపన్న్గుల జాబితా విడుదల
Mukesh Ambani | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా అవతరించారు. 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నారని ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాదికాలంలో ముకేశ్ సంపాదన 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 13వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగి 116 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. దేశీయ 100 మంది శ్రీమంతులు సంపద విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2023లో 799 బిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద 40 శాతం అధికమై ట్రిలియన్ డాలర్లు అధిగమించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది.
జాబితాలోకి పార్థసారథి రెడ్డి
ఫోర్బ్స్ 2024 సంవత్సరానికిగాను విడుదల చేసిన జాబితాలోకి కొత్తగా ఇద్దరు తెలుగువాళ్లు ప్రవేశించారు. వీరిలో హెటిరో గ్రూపు ఫౌండర్ బీ పార్థ సారథి రెడ్డి ఉన్నారు. 3.85 బిలియన్ డాలర్ల సంపదతో 81వ స్థానంలో ఉన్నారు. అలాగే బయోలాజిక్ ఈ అధినేత మహిమా దాట్లా 3.3 బిలియన్ డాలర్లతో 100వ స్థానంలో నిలిచారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

