న్యూఢిల్లీ, నవంబర్ 12 : ఎంటీఎన్ఎల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణాల చెల్లింపుల్లో సంస్థ విఫలమైంది. పలు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 5,492 కోట్ల రుణంతోపాటు రూ.234.28 కోట్లు వడ్డీ కలుపుకొని రూ.5,726.29 కోట్ల రుణాలు చెల్లింపుల్లో విఫలమైంది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థకు రూ.32,097.28 కోట్ల రుణాలు ఉన్నాయి. కంపెనీ కన్నాలిడేటెడ్ రూ.798 కోట్ల ఆదాయంతో పోలిస్తే 40 రెట్ల అధికంగా రుణాలు ఉన్నాయి.