న్యూఢిల్లీ, ఆగస్టు 23: కొనుగోలుదారులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో మారుతి సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 150 నెక్సా ఔట్లెట్లను తెరవబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో అత్యధికంగా ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం బెంగళూరులో తన 500వ ఔట్‌లెట్‌ను తెరిచింది. ఈ సందర్భంగా మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ…నెక్సా రిటైల్ స్టోర్లను వేగవంతంగా విస్తరిస్తున్నట్లు, ఇక నుంచి తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు.