ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 16, 2021 , 23:58:24

ఎంఆర్ఎఫ్ సిబ్బందికి నెల బోన‌స్‌.. జేకే టైర్స్ సియ‌ట్ క్వైట్ డిఫ‌రెంట్‌!

ఎంఆర్ఎఫ్ సిబ్బందికి నెల బోన‌స్‌.. జేకే టైర్స్ సియ‌ట్ క్వైట్ డిఫ‌రెంట్‌!

ముంబై: ప‌్ర‌ముఖ టైర్ల త‌యారీ సంస్థ ఎంఆర్ఎఫ్ త‌న ఉద్యోగులు, కార్మికుల‌కు నెల వేత‌నాన్ని బోన‌స్‌గా ప్ర‌క‌టించింది. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న త‌ర్వాత ఉద్యోగుల‌కు బోన‌స్ ప్ర‌క‌టించిన తొలి సంస్థ‌గా ఎంఆర్ఎఫ్ నిలిచింది. క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాదిలో ఎంఆర్ఎఫ్ త‌న ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్ ఇవ్వ‌లేదు. 

సిబ్బందికి పంపిన ఇంట‌ర్న‌ల్ లేఖ‌లో ఎంఆర్ఎఫ్ చైర్మ‌న్ కేఎం మ‌న్మెన్..ఇంక్రిమెంట్ లేకుండా గ‌తేడాది ప‌ని చేసిన ఉద్యోగులంద‌రికి నెల వేత‌నం బోన‌స్‌గా పంపిణీ చేస్తున్నాం. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారంద‌రికీ అభినంద‌న‌గా ఈ బోన‌స్ పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. త‌న వాటాదారుల‌కు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎంఆర్ఎఫ్ ఈక్విటీపై మూడు రూపాయ‌ల మ‌ధ్యంత‌ర డివిడెండ్‌ను ప్ర‌క‌టించింది. 

టైర్ల‌కు డిమాండ్ పెర‌గ‌డంతో డిసెంబ‌ర్ నెల‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.521 కోట్లు న‌మోదైంది. గ‌తేడాదితో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెట్టింపుకంటే ఎక్కువ లాభాలు గ‌డించింది ఎంఆర్ఎఫ్‌. ఇదిలా ఉంటే ఇత‌ర టైర్ల త‌యారీ సంస్థ జేకే టైర్స్‌, సియ‌ల్ సంస్థ‌లు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాయి. సిబ్బంది వేత‌నాల్లో కోత‌లు విధించాయి. క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత వ్య‌క్తిగ‌త వాహ‌నాల కొనుగోళ్ల‌కు డిమాండ్ పెరుగ‌డంతో టైర్ల త‌యారీ కంపెనీలు కోలుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo