హైదరాబాద్, మే 7: రాష్ర్టానికి చెందిన ఐటీ సొల్యుషన్స్ అండ్ సేవల సంస్థ మౌరిటెక్..స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. గతంలో సెబీకి దరఖాస్తు చేసుకున్న సంస్థ..ఆ తర్వాత విరమించుకున్నది. మళ్లీ తొమ్మిది నెలల తర్వాత ఈ నెల మొదట్లో సెబీకి దరఖాస్తు చేసుకున్నది.
సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో కొత్తగా షేర్లను విక్రయించడం ద్వారా రూ.250 కోట్లు, ప్రమోటర్లు, ఇతర వాటాదారుల వాటాను విక్రయించడం ద్వారా మరో రూ.1,250 కోట్లు సేకరించాలనుకుంటున్నంది. ప్రమోటర్లలో సుజాయ్ పతురు రూ.726.30 కోట్ల విలువైన షేర్లు, అనిల్ రెడ్డి యెర్రంరెడ్డి రూ.370.60 కోట్ల విలువైన షేర్లను, శ్రీనివాసు రాం సందకకు చెందిన రూ.153.10 కోట్ల విలువైన షేర్ల విక్రయించనున్నారు.