Moto G85 5G | చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ85 5జీ ఫోన్‌ను ఈ నెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 3డీ కర్వ్డ్ పోలెడ్ డిస్ ప్లే వస్తోంది. తన అధికార వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో మోటో జీ85 5జీ ఫోన్ విక్రయాలు ప్రారంభం అవుతాయని మోటరోలా తెలిపింది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తోపాటు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల 3డీ కర్వ్డ్ పోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందీ మోటో జీ85 5జీ ఫోన్. కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలీవ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో వస్తోంది. ఐపీ52 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ వాటర్ ఇంగ్రెస్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ పొందింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వస్తున్నదీ స్మార్ట్ ఫోన్. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
మోటో జీ85 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ (సోనీ ల్వెతియా 600) కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ధర ఎంత అన్నది వెల్లడించలేదు.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!