Motorola Razr 50 Ultra | గతేడాది మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్‌ను గతేడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో విక్రయాలను ప్రోత్సహించడానికి వీలుగా ఈ మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధరపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 12జీబీ ర్యామ్‌తోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో వస్తున్న మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) లాంచింగ్ ధర రూ.99,999. కాగా, ఇప్పుడు రూ.79,999లకే సొంతం చేసుకోవచ్చు.
50-మెగా పిక్సెల్ డ్యుయల్ ఔటర్ కెమెరా, 32- మెగా పిక్సెల్ ఇన్నర్ కెమెరా సెటప్‌తో వస్తున్న మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్‌ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఈ నెల 26తో ముగుస్తుంది. దీంతోపాటు రూ.6,999 విలువ గల మోటో బడ్స్ + కూడా అందిస్తోంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీవోబీ కార్డ్, ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.2,500 వరకూ డిస్కౌంట్‌తో మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ రూ.67,499లకు సొంతం చేసుకోవచ్చు.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ గతేడాది జూలైలో ఆవిష్కరించారు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) ఎల్టీపీఓ పోలెడ్ ఇన్నర్ డిస్ప్లే విత్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4- అంగుళాల కవర్ డిస్ప్లే (1080×1272 పిక్సెల్స్) ఎల్టీపీఓ పోలెడ్ ప్యానెల్ విత్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటాయి. ఈ కెమెరాలు ఫోల్డబుల్ ఔట్సైడ్గా నిలుస్తాయి. 32-మెగా పిక్సెల్ కెమెరా ఇన్సైడ్ ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ జీపీఎస్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 15వాట్ల వైర్లెస్ చార్జింగ్, 5వాట్ల రివర్స్ వైర్లెస్ చార్జింగ్ మద్దతుతో 4,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.