Motorola Edge 50 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మిడ్ రేంజ్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది. ఏఐ-బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 4ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999లకు లభిస్తుంది. ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద బేస్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999లకే అందిస్తుంది. ఈ ఫోన్ల సేల్స్ ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఆన్ లైన్ స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. బ్లాక్ బ్యూటీ, లుక్స్ లావెండర్, మూన్ లైట్ పెరల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మూన్ లైట్ పెరల్ కలర్ ఆప్షన్ ఇటలీలో హ్యాండ్ క్రాఫ్ట్‌గా రూపొందించింది. మూన్ లైట్ పెరల్ కలర్ ఆప్షన్ తో వస్తున్న ఫోన్ ఈ నెల 8 నుంచి అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులతో ఈఎంఐ ఆప్షన్ల కింద కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్స్టంట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.2,000 రాయితీ లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల 1.5కే పోలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. హెచ్ డీఆర్10+ మద్దతుతో 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. క్వాల్ కామ్ 4ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు ఓఎస్ అప్ గ్రేడ్స్ అందిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఓఐఎస్ సపోర్ట్ ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఆటో ఫోకస్, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తుంది.
125 వాట్ల వైర్డ్, 50 వాట్ల వైర్ లెస్ టర్బో చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో మోటరోలా ఎడ్జ్50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ వస్తుంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్ కోసం 64 వాట్ల చార్జర్, 12 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ కోసం 125వాట్ల చార్జర్ కూడా అందిస్తారు.