Motorola Edge 50 Fusion | ప్రముఖ చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్ ను భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ తో పని చేస్తుందీ ఫోన్. మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందిస్తామని తెలిపింది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.67- అంగుళాల పోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 68వాట్ల టర్బో పవర్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్తోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకు లభిస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు సొంతం చేసుకోవచ్చు. హాట్ పింక్, మార్షామాలో బ్లూ కలర్, పీఎంఎంఏ ఫినిష్ తోపాటు ఫారెస్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ఈ నెల 22 నుంచి ఈ-కామర్స్ జెయింట్ ప్లిప్ కార్ట్, కంపెనీ వెబ్ సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయాలు సాగుతాయి. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసినా, క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లతో ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఫోన్ 360 టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 700 సీ సెన్సర్, 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, డబుల్స్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2 జీపీఎస్, ఎఫ్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న ఈ ఫోన్ లో ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, ఈ-కంపాస్, ఆంబియెంట్ లైట్ సెన్సర్ ఉంటాయి.