Moto G14 | మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫోన్ మోటో జీ14 4జీ.. !
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లోకి ‘జీ’ సిరీస్ ఫోన్ మోటో జీ14 ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ రూ.9999లకే లభిస్తుంది.
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన జీ సిరీస్‌లో మోటో జీ14 (Moto G14) ఫోన్ తీసుకొచ్చింది. అత్యంత చౌక ధరకు అందుబాటులోకి తెచ్చిన మోటో జీ14 ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ టర్న్డ్ స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తున్నది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 20వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.
మోటో జీ 14 (Moto G14) ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తోపాటు మూడేండ్లపాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. మోటో జీ14 ఫోన్ 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9999లకు లభిస్తుంది. స్టీల్ గ్రే, స్కై బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఆగస్టు 8 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ.750 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
మోటో జీ14 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ పిక్సెల్ డెన్సిటీ ఆఫ్ 405 పీపీఐతో వస్తుంది. ఈ ఫోన్ ఓక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్ సెట్ విత్ ఆర్మ్ మాలీ-జీ57 ఎంపీ1 తో వస్తుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (పీడీఏఎఫ్), వీడియో కాల్స్ అండ్ సెల్ఫీల కోసం 2-మెగా పిక్సెల్స్ మాక్రో కెమెరాతో వస్తున్నది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఈ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్స్ వరకూ పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

