Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా తన మోటో జీ14 ఫోన్ మరో రెండు కలర్ ఆప్షన్లలో రానున్నది. ఈ నెల ప్రారంభంలో స్టీల్ గ్రే, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించారు. మోటో జీ14 ఫోన్ 4జీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ బడ్జెట్ సెగ్మెంట్లో రూ.9,999లకే లభిస్తుంది.
తాజాగా ఈ నెల 24న న్యూ బట్టర్ క్రీమ్, పాలె లిలాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ వేదికగా ఆవిష్కరిస్తారు. ఆండ్రాయిడ్ 13 విత్ కంపెనీ మై యూఎక్స్ వర్షన్ మీద ఫోన్ పని చేస్తుంది.
6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ 405 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తున్నది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్సెట్ ఉంటుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (పీడీఏఎఫ్), సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 2-మెగా పిక్సెల్స్ మాక్రో కెమెరా ఉంటుంది.
20వాట్ల టర్బో పవర్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్-బాండ్ వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.