Moto E13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో ఈ13 ఫోన్ గత ఫిబ్రవరిలో ఆవిష్కరించింది. తాజాగా నూతన స్టోరేజీ వేరియంట్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ 606 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తున్నది. మోటో ఈ13 ఫోన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సేల్స్.. బుధవారం నుంచి ప్రారంభం అవుతాయి. దీని ధర రూ.8,999. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వారు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఇంతకుముందు రెండు స్టోరేజీ ఆప్షన్లు, మూడు కలర్స్‌లో లభించింది మోటో ఈ13. 2జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4 జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు.
మోటో ఈ13 ఫోన్ 6.5-అంగుళాల హెచ్డీ+ (1600×700 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మాలీ-జీ57 ఎంపీ1 జీపీయూతో ఒక్టాకోర్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.
13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ డోల్బీ ఆట్మోస్ ఆడియోకు సపోర్ట్‌గా నిలుస్తుంది.
బ్యాటరీ రీచార్జ్ చేస్తే 23 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ లభిస్తుంది. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో మోటో ఈ13 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. ఈ ఫోన్ 2.4 హెర్ట్జ్ అండ్ 5హెర్ట్జ్ డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.