నూఢిల్లీ, ఆగస్టు 21: ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..స్కూటర్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు 125 సీసీ సామర్థ్యం కలిగిన మరిన్ని బైకులను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇతర పోటీ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి మరిన్ని పెట్రోల్, ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా వెల్లడించారు.
అలాగే 125 సీసీ కెపాసిటీ కలిగిన ఎక్స్ట్రీమ్ 125ఆర్ కెపాసిటీని నెలకు 40 వేల యూనిట్లకు పెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం నెలకు 25 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతున్నా యి. 125 నుంచి 160 సీసీ సామర్థ్యం కలిగిన పలు మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.