51 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ
హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మర్డోర్ ఇంటిలిజెన్స్..వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్లో మెజార్టీ వాటా 51 శాతంను కొనుగోలు చేసింది. ఎంతకు కొనుగోలు చేసిన విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించింది.
దీంతో గ్లోబల్ మార్కెట్లో మర్డోర్ వాటా 76 శాతానికి చేరుకోనున్నది. 2028 నాటికి ఇరు సంస్థల టర్నోవర్ రూ.400 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఫౌండర్, సీఈవో భరద్వాజ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 750 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్యను 2 వేలకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు.