జీడీపీకి మూడీస్ కత్తెర.. వృద్ధి అంచనాను 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు
భారత ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు వరుసపెట్టి తగ్గిస్తున్న క్రమంలోనే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సైతం కుదించింది. 2022 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం ప్రకటించింది. ఇదే సంస్థ ఈ ఏడాది మే నెలలో 8.8 శాతం వృద్ధి రేటును అంచనావేయగా, దానికి సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది
- 2023లో 4.8 శాతానికి పడిపోతుందని అంచనా
- అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
- ఆర్బీఐ మరో అరశాతం రెపో రేటు పెంచవచ్చు
న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు వరుసపెట్టి తగ్గిస్తున్న క్రమంలోనే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సైతం కుదించింది. 2022 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం ప్రకటించింది. ఇదే సంస్థ ఈ ఏడాది మే నెలలో 8.8 శాతం వృద్ధి రేటును అంచనావేయగా, దానికి సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరోసారి అంచనాల్ని దించింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీరేట్లు, మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కలిపి భారత్ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయని ‘గ్లోబల్ అవుట్‌లుక్ 2023-24’లో మూడీస్ వ్యాఖ్యానించింది. 2023లో భారత్ వృద్ధి రేటు మరింతగా 4.8 శాతానికి క్షీణిస్తుందని, అటుతర్వాత 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని వివరించింది. మూడీస్ వ్యాఖ్యలివి…
- కనిష్ఠ రూపాయి విలువ, అధిక క్రూడ్ ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతాయి. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతానికి చేరగా, టోకు ద్రవ్యోల్బణం వరుసగా 18 నెలల నుంచి రెండంకెల్లో నమోదవుతున్నది.
- ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు, రూపాయి విలువను స్థిరపర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అంచనా. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆర్బీఐ 190 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచడంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది.
- తదుపరి పెంపు తర్వాత ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న సూచనలు కన్పిస్తే ఆర్బీఐ.. వృద్ధిపై దృష్టిపెడుతుంది.
- దేశీయ ఫండమెంటల్స్ బలంగా ఉన్నా, అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరంకావడం, డిమాండ్ మందగించడంతో 2023లో భారత్ వృద్ధి రేటు మరింతగా తగ్గుతుంది.
- జీ-7 దేశాల్లో (ఏడు ధనిక దేశాల గ్రూప్) డిమాండ్ బలహీనపడుతున్న ప్రభావం ఇండియా, బ్రెజిల్ వంటి దేశీ వినియోగంపై ఆధారపడిన దేశాలపై తక్కువగా ఉంటుంది. ఎగుమతి ఆధారిత దేశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
- అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఏర్పడిన అనిశ్చితి, ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు, కఠినతర ద్రవ్య విధానాలు, భౌగోళిక రాజకీయ మార్పులు తదితరాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ క్షీణ బాట పడుతున్నది.
- 2023లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు మరింతగా మందగిస్తుంది. ప్రస్తుత సవాళ్లను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంక్‌లు అధిగమించగలిగితే 2024లో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ నెలాఖర్లో క్యూ2 జీడీపీ డాటా
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ1 జీడీపీ 13.5 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 4.10 శాతం వృద్ధి నమోదయ్యింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికపు గణాంకాలు ఈ నెలాఖర్లో విడుదలవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని రిజర్వ్‌బ్యాంక్ అంచనా వేస్తున్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

