హైదరాబాద్, జూలై 27: ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.125 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉండటంతో ఈ భారీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఎండీ జే లక్ష్మణ రావు తెలిపారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా డామన్‌లో రూ.30 కోట్లతో రెండో యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 80 శాతం వృద్ధితో రూ.22 కోట్లు ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. అలాగే టర్నోవర్ రూ.134 కోట్ల నుంచి రూ.208 కోట్లకు చేరుకున్నది.