Auto Sales | న్యూఢిల్లీ, మే 1 : మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ గడిచిన నెలలో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలు మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు పెరగగా.. టాటా మోటర్స్, హ్యుందాయ్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ మహీంద్రా రెండో స్థానానికి, టాటా మోటర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. కానీ, రెండో స్థానంలో కొనసాగిన హ్యుందాయ్ ఈసారి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నది. మారుతి అమ్మకాలు ఏడు శాతం అధికమయ్యాయి.