హైదరాబాద్, జూలై 9: రాష్ర్టానికి చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ మివీ ..మార్కెట్లో ఏఐ ఆధారిత బడ్స్‌ను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్సైట్లలో లభించే ఈ కొత్త ఉత్పత్తి ధర రూ.6,999గా నిర్ణయించింది. నాలుగు రంగులు గోల్డ్, బ్లాక్, సిల్వర్, బ్రొంజ్ మాడళ్లలో లభించనున్న ఈ పరికరం హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌లోనే తయా రు చేసినట్లు చెప్పారు.
ఏఐ ఆధారంగా హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠి, కన్నడ, మలయాళం వంటి ఎనిమిది భాషల్లో ఈ పరికరం అనుసంధానంకానున్నది. ఒక్కసారి రీచార్జి చేస్తే 40 గంటలపాటు ఈ బ్యాటరీ లైఫ్ ఇవ్వనున్నది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, యూఎస్బీ టైప్-సీ చార్జర్, వాటర్-రెసిస్టెంట్ డిజైనింగ్ టెక్నాలజీతో తీర్చిదిద్దింది.