హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ఆయన సమావేశమై..రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు భారీగా అవకాశాలున్నాయని సూచించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వం నుంచి అందించే సహకారాన్ని వివరించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసిన ఆయన.. పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.