హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణను గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలనే తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూఏఈ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. తన యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకనామి అండ్ రిమోట్ వర్క్స్ అప్లికేషన్స్ ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాతో గురువారం ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా.. ఏఐ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని, డీప్‌టెక్, ఏఐ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టాలి ఆయన యూఏసీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నానో జీసీసీలు, డిజిటల్ హబ్స్ ఏర్పాటు చేయాలన్నారు.