Satya Nadella on TikTok | సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను టేకోవర్ చేసుకునేందుకు తాము జరిపిన చర్చలు ఫెయిలయ్యాయని గూగుల్ సీఈవో సత్యనాదెళ్ల చెప్పారు. తన కెరీర్లో విచిత్రమైన అంశంపై పని చేశానని సోమవారం జరిగిన క్లౌడ్ సదస్సులో మాట్లాడుతూ సత్య నాదెళ్ల అన్నారు. గతేడాది చైనా బైట్ డ్యాన్స్ అనుబంధ వీడియో సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ అమెరికా యూనిట్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనున్నదని వార్తలొచ్చాయి. కానీ చివరిక్షణంలో ఆ ప్రతిపాదన వెనక్కెళ్లింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టిక్‌టాక్ యూజర్ల డేటాతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని గతేడాది అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టిక్‌టాక్ అమెరికా యూనిట్‌ను విడదీయాలని బైట్ డ్యాన్స్ సంస్థను ట్రంప్ కోరారు. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో టిక్‌టాక్ స్వాధీనం కోసం చర్చలు జరిగినా సెప్టెంబర్ నాటికి నిలిచిపోయాయి. చివరకు ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా ట్రంప్ స్థానంంలో జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడంతో టిక్‌టాక్ వీడియో యాప్‌ను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన తెచ్చారు.
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ కోసమే తాను ప్రయత్నించానని సత్య నాదెళ్ల తెలిపారు. ఇది నమ్మ శక్యం కాకపోయినా టిక్ టాక్ టేకోవర్ కోసం జరిగిన చర్చల్లో పలువురు వ్యక్తుల నుంచి పలు రకాల అనుభవాలు నేర్చుకున్నానని సత్య నాదెళ్ల అన్నారు. టిక్‌టాక్ యాజమాన్యం తమ దగ్గరకు వచ్చిందే తప్ప తాము వెళ్లలేదని తేల్చి చెప్పేశారు.