న్యూఢిల్లీ: ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్‌టెక్ సంస్థ గ్రోవ్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్తోపాటు కంపెనీ సలహాదారుడిగా కూడా ఆయన పనిచేయనున్నారు. ఈ విషయాన్ని గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేశ్రే ట్విట్టర్లో వెల్లడించారు.