MG Astor | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. ఈ ఏడాదిలోనే భారత్ మార్కెట్లో ఎంజీ మోటార్స్ తన ఎంజీ ఆస్టర్ ఫేస్ లిఫ్ట్ కారు ఆవిష్కరించింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో రెండోసారి కావడం గమనార్హం.
ఎంజీ ఆస్టర్ (MG Astor) సావీ ప్రో 1.3 టర్బో ఏటీ (సాంగ్రియా రెడ్) వేరియంట్, సీవీటీ (ఐవోరీ), 1.5 సీవీటీ (సాంగ్రియా రెడ్) మోడల్ కార్ల ధరలు రూ.27 వేలు పెరుగుతాయి. మరోవైపు షార్ప్ ప్రో 1.5 లీటర్ల సీవీటీ (ఐవోరీ) ధర రూ.26 వేలు పెరుగుతుందని ఎంజీ మోటార్స్ తెలిపింది. ఇక సెలెక్టెడ్ 1.5 సీవీటీ (ఐవోరీ) ధర రూ.21 వేలు, షార్ప్ ప్రో 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐవోరీ) వేరియంట్ రూ.24 వేలు వృద్ధి చెందుతాయి.
ఇంకా సెలెక్ట్ 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఐవోరీ), షైన్ 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐవోరీ) వేరియంట్ ధరలు రూ.20 వేలు పెరుగనున్నది. ఈ ఏడాది జూన్ లో ఎంజీ ఆస్టర్ కారు ధర రూ.26,800 పెంచింది. ఎంజీ ఆస్టర్ కారు ధర రూ.9.98 లక్షల నుంచి రూ.18.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హై రైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది ఎంజీ ఆస్టర్.
న్యూ ఎంజీ ఆస్టర్ కారు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అండ్ వైర్ లెస్ ఫోన్ చార్జర్ వంటి పలు కొత్త ఫీచర్లతో వస్తోంది. 14 లెవల్-2 సేఫ్టీ ఫీచర్లు, 49+ సేఫ్టీ ఫీచర్లతోపాటు 360-డిగ్రీ అరౌండ్ వ్యూ కెమెరా, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ స్మార్ట్ 2.0 యూఐ వంటి ఫీచర్లు ఉంటాయి. వాతావరణం, వార్తలు, క్యాలికులేటర్, జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ తోపాటు వాయిస్ కమాండ్స్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీకి మద్దతుగా ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్ పని చేస్తుంది.
ఇంకా ఎంజీ ఆస్టర్ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ తోపాటు 6- ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసెంట్, డీసెంట్ కంట్రోల్, హీటెడ్ ఓఆర్వీఎంతోపాటు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్లు ఉంటాయి. ఇక ఎంజీ ఆస్టర్ కారు 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (110 పీఎస్ విద్యుత్, 144 ఎన్ఎం టార్క్), 1.3 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ (140 పీఎస్ విద్యుత్, 220 ఎన్ఎం టార్క్) కలిగి ఉంటుంది. రెండు ఇంజిన్ ఆప్షన్లలోనూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి.