Meta AI Assistant | మెటా ఎట్టకేలకు వాట్సాప్‌లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెంట్‌ను లాంఛ్ చేసింది. దీంతో యూజర్లు నేరుగా తమ మెసేజింగ్‌లో నేరుగా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటు లభించింది. కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉండే మెటా ఏఐ భారత్ సహా పరిమిత దేశాల్లో లభిస్తుంది. ఏఐ అసిస్టెంట్ యూజర్లకు మెరుగైన సంభాషణల సామర్ధ్యం, సమాచార అన్వేషణ, నేరుగా వాట్సాప్‌లోనే సూచనలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ తరహాలో వాట్సాప్‌లో మెటా ఏఐ ఫీచర్ పలు అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, టెక్ట్స్, ఇమేజ్‌లను జనరేట్ చేయడం, భాషల మధ్య అనువాదం, ఐడియాలను సజెస్ట్ చేయడం వంటివి ఆఫర్ చేస్తుంది. యూజర్లు గ్రూప్ చాట్స్‌తో పాటు వ్యక్తిగతంగా సలహాలు కోరడం, న్యూస్ అప్డేట్స్కు రిక్వెస్ట్ చేయడం కోసం మెటా ఏఐతో ఇంటరాక్ట్ అవచ్చు.
అయితే రెగ్యులర్ వాట్సాప్ చాట్స్ ఎండ్‌టూఎండ్ ఎక్క్రిప్షన్ కలిగిఉండగా, మెటా ఏఐని యూజర్లు ఏమి కోరినా అది ఎన్క్రిప్టెడ్ కాదని గుర్తుంచుకోవాలి. తమ ఏఐకి శిక్షణ ఇచ్చేందుకు యూజర్ డేటా, ప్రాంఫ్ట్స్ను తాము వాడుకుంటామని అందుకే సదరు డేటా ఎన్క్రిప్టెడ్ కాదని మెటా చెబుతోంది. మెటా ఏఐని అడిగిన ప్రశ్నలను మాత్రమే ఏఐ అసిస్టెంట్ చదవి, బదులిస్తుందని ఇతరమైనవి కాదని మీ వ్యక్తిగీత మెసేజ్‌లు, కాల్స్ ఎండ్‌టూఎండ్ ఎన్క్రిప్టెడ్ భద్రత కలిగిఉంటాయని మెటా పేర్కొంది.
Read More :
Ram Navami | రామనవమికి ముస్తాబవుతున్న అయోధ్యానగరి.. వేడుకలకు 40 లక్షల మంది భక్తులు!