Meta : మెటా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. డెర్మాన్క్లో రెండు డేటా కొత్త సెంటర్ల నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపేసింది. నిర్మాణ కంపెనీతో చేసుకున్న 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మెటా కంపెనీ ఉన్నట్టు ఒక అధికార ప్రతినిధి తెలిపాడు. మా ఆర్థిక వనరులను ఎక్కువ ప్రాధాన్యం ఉన్న విభాగంలో పెట్టుబడి పెట్టేందుకు తీసుకున్న నిర్ణయాల్లో ఇదొకటి. ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లతో పాటు ఒడెన్సేలోని డేటా సెంటర్ మా కంపెనీకి వెన్నెముక లాంటివి అని మెటా నార్డిక్ కమ్యూనికేషన్ మేనేజర్ పీటర్ మున్స్టర్ వెల్లడించాడు.
డెన్మార్క్‌లోని ఒడెన్సే సిటీలో మెటా కంపెనీ 55వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా సెంటర్‌ని నిర్వహిస్తోంది. ఇది 2009 నుంచి ఆన్లైన్ సేవలు అందిస్తోంది. మరుసటి ఏడాది ఈ క్యాంపస్‌ను 30 వేల చదరపు అడుగుల మేర విస్తరిస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఈమధ్యే అదే క్యాంపస్‌లో కొత్తగా రెండు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దాంతో క్యాంపస్ విస్తీర్ణం మొత్తం 90వేల చరరపు అడుగుల అవుతుంది. డేటా సెంటర్ల నిర్మాణ బాధ్యతను డెన్మార్క్‌లోని పెర్ ఆర్స్లెఫ్ అనే సివిల్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. డేటా సెంటర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఒప్పందం రద్దు కావడంతో అవి ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి అని పెర్ అర్స్లెఫ్ సంస్థ వెల్లడించింది.