Meta Down | సైబర్ దాడితోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు డౌన్..?!
Meta Down | ప్రపంచవ్యాప్తంగా మంగళవారం వాట్సాప్ మినహా మెటా సేవలన్నీ నిలిచిపోయాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్ సేవలు ప్రభావితమయ్యాయి. భారత్‌తో పాటు పలు దేశాల్లో దాదాపు గంటన్నర వరకు వినియోగదారులు మెటా సర్వీసెస్ నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.
Meta Down | ప్రపంచవ్యాప్తంగా మంగళవారం వాట్సాప్ మినహా మెటా సేవలన్నీ నిలిచిపోయాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్ సేవలు ప్రభావితమయ్యాయి. భారత్‌తో పాటు పలు దేశాల్లో దాదాపు గంటన్నర వరకు వినియోగదారులు మెటా సర్వీసెస్ నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సోషల్ మీడియా అకౌంట్లు పని చేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు.
🚨🇮🇱🇺🇸 Cyberattack hit Social media and messenger applications including Instagram, Facebook and Youtube with users in Israel and worldwide reporting difficulty logging in to their meta accounts. pic.twitter.com/Za7iVLQbsc
— Terror Alarm (@Terror_Alarm) March 5, 2024
ప్రస్తుతం సేవలు పునరుద్ధరించినా.. సర్వీసులు నిలిచిపోవడానికి మెటా కంపెనీ ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. సర్వీసులు నిలిచిపోయిన సమయంలో యూజర్స్ టైమ్‌లైన్ రిఫ్రెస్ కాకపోవడంతో పాటు చాలా అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయ్యాయి. సేవలు స్తంభించిపోవడానికి సైబర్ అటాక్ కారణంగా భావిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అమెరికాలో జరిగిన సైబర్ దాడిలో ఈ అంతరాయం సైతం భాగమేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా హ్యాకర్ల హస్తం..!
భారత్‌లో కేవలం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెస్సేంజర్, థ్రెడ్స్ సేవలు నిలిచిపోయినప్పటికీ.. అమెరికాలో ఇతర కంపెనీలకు చెందిన సేవలను సైతం స్తంభించాయి. ఈ అంతరాయం వెనుక సైబర్ దాడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ఇటీవల అమెరికాలో హెల్త్‌కేర్ సిస్టమ్‌పై సైబర్ దాడి జరిగిందని, ఆ తర్వాత చాలా ఆసుపత్రులు ప్రజల మెడిక్లెయిమ్లను బిల్లు చేయలేకపోయిన విషయం తెలిసిందే.
What is happening guys?
Is this a Cyber attack?
YouTube, Instagram, Facebook down pic.twitter.com/4NCYvDHzvg— Giannis Andreou (@gandreou007) March 5, 2024
హెల్త్‌కేర్ పేమెంట్ సిస్టమ్‌పైనే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటన అనంతరం మెటా సర్వీసులకు అంతరాయం కలుగగా.. సైబర్ దాడితో ముడిపడి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. హెల్త్‌కేర్ పేమెంట్ సిస్టమ్‌పై సైబర్ దాడి నేపథ్యంలో అమెరికాలో సేవలు కుప్పకూలిపోయాయి. ఈ దాడిలో చైనీస్ హ్యాకర్ల హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

