Old Couple | వరుడికి 80, వధువుకు 75.. మహబూబాబాద్‌లో వృద్ధుల పెండ్లి.. వీడియో వైరల్
Old Couple | సాధారణంగా వివాహాలు యుక్త వయస్సులో ఉన్న వాళ్లు చేసుకుంటారు. చాలా పెండ్లిళ్లలో వధూవరుల వయస్సు దాదాపుగా 30 ఏళ్ల లోపే ఉంటుంది. అరుదుగా కొంతమంది నలభైలలో కూడా పెళ్లి చేసుకుంటారు. అంతేతప్ప మరీ 80 ఏండ్ల వయస్సులో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు ఎనిమిది పదులు వయస్సులో పెళ్లి చేసుకున్నారు.
Old Couple : సాధారణంగా వివాహాలు యుక్త వయస్సులో ఉన్న వాళ్లు చేసుకుంటారు. చాలా పెండ్లిళ్లలో వధూవరుల వయస్సు దాదాపుగా 30 ఏళ్ల లోపే ఉంటుంది. అరుదుగా కొంతమంది నలభైలలో కూడా పెళ్లి చేసుకుంటారు. అంతేతప్ప మరీ 80 ఏండ్ల వయస్సులో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు ఎనిమిది పదులు వయస్సులో పెళ్లి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాకు చెందిన సమిడా నాయక్ వయసు 80 ఏళ్లు. ఆయన 75 ఏళ్ల వయస్సున్న గుగులోతు లాలమ్మను వివాహం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ గతంలో కూడా దంపతులే. 70 ఏళ్ల క్రితం వారికి గంధర్వ వివాహం జరిగింది. వారికి నలుగురు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు.
అయితే నాడు గంధర్వ వివాహం చేసుకున్న ఈ దంపతులకు సంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి జరిపించాలని వారి మనుమలు, మనుమరాలు నిర్ణయించారు. ఆ మేరకు మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాత, నానమ్మలకు వివాహం జరిపించారు. ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడటానికి తండాలోని జనం అంతా తరలివచ్చారు. కాగా, ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు
మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు.
70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.… pic.twitter.com/dVELpv1Eld
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

