పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరలు రూ.90 వేల నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 9 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరలు రూ.90 వేల నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనుకావడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంలో సీ-క్లాస్ మాడల్ రూ.90 వేల వరకు, బెంజ్ మేబ్యాక్ ఎస్ 680 మాడల్ రూ.12.2 లక్షల వరకు ప్రియంకానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ ఐయర్ తెలిపారు.
జూన్ 1న తమ వాహన ధరలను 1-2 శాతం వరకు పెంచుతున్న సంస్థ.. సెప్టెంబర్ 1 నుంచి 1.5 శాతం వరకు సవరిస్తున్నది. గడిచిన నాలుగు నెలల్లో రూపాయి కరెన్సీ భారీగా పడిపోయిందని, ముఖ్యంగా యూరోతో పోలిస్తే 10 శాతం తగ్గడం వల్ల సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, ఇప్పటికే ఆడీ ఇండియా, బీఎండబ్ల్యూ సంస్థలు కూడా తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

