Mercedes-Benz EQE | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) భారత్ మార్కెట్లో ఈక్యూఈ ఎస్యూవీ (Mercedes-Benz EQE SUV) ఆవిష్కరించింది. దీని ధర రూ.1.39 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈక్యూఈ 500 4మ్యాటిక్ (EQE 500 4Matic) వేరియంట్ మాత్రమే లభిస్తుంది. ఈక్యూబీ (EQB), ఈక్యూఎస్ (EQS) తర్వాత భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్న మూడో ఎస్యూవీ ఎలక్ట్రిక్ వేరియంట్ ఈక్యూఈ ఎస్యూవీ (EQE SUV) కారు అవుతుంది.
మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఈ ఎస్యూవీ చూడటానికి మెర్సిడెస్ -ఈక్యూ ఫ్యామిలీ మోడల్‌గా కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్స్ స్లిమ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. 4,863 ఎంఎం పొడవు, 3,030ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటుంది. ఈక్యూఎస్ (EQS)లో మాదిరిగా ఈక్యూఈ ఎస్యూవీ (EQE) మోడల్ కారు 56-అంగుళాల హైపర్ స్క్రీన్‌తో వస్తున్నది. వెరీ అడ్వాన్స్డ్ క్యాబిన్ లేఔట్ కోసం హైపర్ స్క్రీన్ సింగిల్ గ్లాస్ ప్యానెల్ కింద మూడు డిస్ ప్లేలు కలిగి ఉంటుంది. వెంటిలేషన్ ఫంక్షనల్‌గా సీట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్గా ఉంటాయి. యాంబియెంట్ లైటింగ్, బర్ మెస్టర్ ఆడియో సిస్టమ్, ఇన్ విజిబుల్ బాయ్ నెట్ సిస్టమ్, సేఫ్టీ కోసం అడాస్ ఫంక్షనల్ ఫీచర్లు జతచేశారు.
టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఈ 500 ఎస్యూవీ (Mercedes-Benz EQE 500 SUV) డ్యుయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్ తో వస్తున్నది. ఈ కారులో రెండు మోటార్లు వాడొచ్చు. ఇవి గరిష్టంగా 408 బీహెచ్పీ విద్యుత్, 858 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. 4.9 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. గరిష్టంగా గంటకు 210 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. స్టాండర్డ్‌గా ఆఫ్-రోడ్ ప్యాకేజీతో వస్తున్న ఈక్యూఈ 500 డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని ఎయిర్ సస్పెన్షన్‌పై పరయాణం చేయొచ్చు. ఈ కారులో 90కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 170కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో సింగిల్ చార్జింగ్ చేస్తే 550 కి.మీ. దూరం పరయాణిస్తుంది.
ఆడి క్యూ8 ఈ-ట్రాన్, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జాగ్వార్ ఐ-పేస్ వంటి కార్లతో పోటీ పడుతుంది మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఈ 500 ఎస్యూవీ. కానీ ఈ మూడు కార్లతో పోలిస్తే కాసింత పిరమే.