Mercedes-Benz EQA | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ – బెంజ్ ఇండియా.. సోమవారం దేశీయ మార్కెట్లో అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ (Mercedes – Benz EQA)ను ఆవిష్కరించనున్నది. ప్రస్తుత జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నదీ ఎలక్ట్రిక్ ఈక్యూఏ. మూడేండ్ల క్రితమే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన మెర్సిడెజ్ బెంజ్.. తాజాగా భారత్ మార్కెట్లోకి తీసుకొస్తున్నది. దీని ధర రూ రూ.65-70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 70.5 కిలోవాట్ల బ్యాటరీతో వస్తున్న డబ్ల్యూఎల్టీపీ రేంజ్ సింగిల్ చార్జింగ్‌తో 560 కి.మీ దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. రియల్ వరల్డ్ రేంజ్ మోడల్ 450-460 కి.మీ దూరం ప్రయాణిస్తుందని భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ ఎస్యూవీ మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ (Mercedes – Benz EQA) కారు గరిష్టంగా 140 కిలోవాట్ల విద్యుత్, 385 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుందని తెలుస్తోంది. గరిష్టంగా గంటకు 160 కి.మీ దూరం ప్రయాణించనున్న ఈ కారు కేవలం 8.6 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్నది. 11 కిలోవాట్ల వాల్ చార్జర్ సాయంతో ఏడు గంటలు, 100 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో 30 నిమిషాల్లోనే 10-80 శాతం చార్జింగ్ అవుతుంది. ఇండివిడ్యుయల్, కంఫర్ట్, స్పోర్ట్, ఈకో అనే నాలుగు డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది.
రీసైకిల్డ్ పీఈటీ బాటిళ్ల నుంచి తయారు చేసిన ఫ్యాబ్రిక్‌తో కారు క్యాబిన్ రూపుదిద్దుకున్నది. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో 7, డ్రైవర్ కోసం నీ ఎయిర్ బ్యాగ్ (Knee Air Bag)తోపాటు మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, మెర్సిడెస్ ప్రీ సేఫ్, సెకండ్ జనరేషన్ ఎంబీయూఎక్స్, కార్ టు ఎక్స్ కనెక్టివిటీ, 64 కలర్ అంబియెంట్ లైటింగ్, హెడ్ అప్ డిస్ ప్లే, ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్ తదితర ఫీచర్లు జత చేశారు.
రెండు మనుఫక్టూర్ పెయింట్ ఆప్షన్ల (మౌంటేన్ గ్రే మాగ్నో, పటాగోనియా రెడ్)తోపాటు ఏడు కలర్ ఆప్షన్లలో ఈ కారు ఆవిష్కరిస్తున్నారు. ఇంకా స్పెక్ట్రల్ బ్లూ, పోలార్ వైట్, హైటెక్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్, మౌంటేన్ గ్రే రంగుల్లో సిద్ధమైంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్1, కియా ఈవీ6, హ్యుండాయ్ ఐయానిక్ 5, వోల్వో సీ40 రీచార్జీ వంటి ఈవీ కార్లకు మార్కెట్లో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ ఈవీ ఎస్యూవీ కారు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!