హైదరాబాద్, సెప్టెంబర్ 26: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్రక్చర్స్…మహారాష్ట్రలో రూ.21 వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నది.
ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో మహారాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మెయిల్ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ కిశోర్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బీవోఎం విధానంలో మెయిల్ ఏర్పాటు చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఐపీవోకి మౌరీ టెక్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఐటీ సేవల సంస్థ మౌరీ టెక్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాల విక్రయం ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. ఈ ఐపీవోల్లో భాగంగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.440 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో షేర్లను విక్రయించడంతో రూ.1,060 కోట్లను సేకరించాలనుకుంటున్నది.