హైదరాబాద్, ఏప్రిల్ 23: రాష్ర్టానికి చెందిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(మెయిల్) మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) నుంచి రూ.13 వేల కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంంది.
ఈ ఆర్డర్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ల నిర్మాణ ప్రాజెక్టునకు సంబంధించి పర్చేజ్ ఆర్డర్ అందుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఇరు కంపెనీల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఎన్పీసీఐఎల్ చరిత్రలో ఏకమొత్తంగా ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇదే కావడం విశేషం.