ఇప్పట్లో భారత్‌కు చోక్సీ అప్పగింత డౌటే!!
ఇప్పట్లో భారత్‌కు చోక్సీ అప్పగింత డౌటే!!| డొమినికాలో కోర్టు విచారణ జరుగుతున్న వరకు మెహుల్ చోక్సీని భారత్‌కు తిప్పి పంపడం సాధ్యం కాదని ఆయన ...

న్యూఢిల్లీ: డొమినికాలో కోర్టు విచారణ జరుగుతున్న వరకు మెహుల్ చోక్సీని భారత్‌కు తిప్పి పంపడం సాధ్యం కాదని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. డొమినికాలో తమ మూలాలను వెల్లడించాక తమకు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఉందని శనివారం తెలిపారు.
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీకి డొమినికాతో ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొంది.
అదే సమయంలో ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని కూడా జడ్జి వ్యానాంటే అడ్రైన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. బెయిల్ పిటిషన్లో ఎటువంటి పూచీకత్తును చోక్సీ సమర్పించలేదని గుర్తు చేశారు.

వైద్య కారణాల రీత్యా తన క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని మెహుల్ చోక్సీ లాయర్ వాదించారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడిగా మెహుల్ చోక్సీ 2018 నుంచి పరారీలో ఉన్నాడు.
భారత్ కూడా అతడ్ని వెనక్కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. గత నెల 23వ తేదీన అంటిగ్వా నుంచి పరారైన మెహుల్ చోక్సీకి తక్షణం భారత్‌కు అప్పగించే విషయమై స్వల్ప ఊరట లభించినట్లే కనిపిస్తున్నది.
మెహుల్ చోక్సీ భారతీయ పౌరుడు అని డొమినికా ప్రధాని రోజ్‌వెల్ట్ స్కెరిట్ ఇటీవల వ్యాఖ్యానించారు. పరారీలో ఉన్న నేరగాడిపై ఆ దేశంలోకి కోర్టులే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తమ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు చోక్సీ హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- dominca
- India
- Mehul Choksi
- PNB Scam
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

