Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో టాప్-5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.85 లక్షల కోట్లు కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బలహీన ధోరణులు నెలకొనడంతో బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల్లోని టాప్-10 సంస్థలకు ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,952.31 కోట్లు కోల్పోయింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1844.2 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 573.25 పాయింట్లు పుంజుకుంది. రిలయన్స్ ఇండస్ట్స్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్)తోపాటు తాజాగా టాప్-10లో చేరిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభాలతో ముగిశాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,479.23 కోట్లు నష్టపోయి రూ.12,67,440.61 కోట్లకు చేరుకున్నది. కోల్కతా కేంద్ద్రంగా పని చేస్తున్న ఐటీసీ సంస్థ ఎం- క్యాప్ రూ.46,481 కోట్లు కోల్పోయి రూ.5,56,583.44 కోట్లకు చేరుకున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 44,935.46 కోట్లు నష్టంతో రూ.6,63,233.14 కోట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు, రిలయన్స్ ఎం-క్యాప్ రూ.12,179.13 కోట్లు పతనంతో రూ.16,81,194.35 కో్ట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,877.49 కోట్లు పతనమై రూ.8,81,501.01 కోట్లకు పరిమితమైంది.
మరోవైపు, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 60,168.79 కోట్లు వృద్ధి చెంది రూ.15,43,313.32 కోట్లకు పెరిగింది. డిసెంబర్ త్త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం రూ.12,380 కోట్లు (11.95శాతం) వచ్చింది. దీంతో శుక్రవారం టీసీఎస్ వాటా దాదాపు ఆరు శాతం పెరిగింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎం-క్యాప్ రూ.13,120.58 కోట్లు పెరిగి రూ.5,41,539.01 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.11,792.44 కోట్ల నుంచి రూ.8,16,626.78 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,999.41 కోట్లు వృద్ధి చెంది రూ.9,19,933.99 కోట్లకు చేరుకుంది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.8,564.26 కోట్లు పుంజుకుని రూ.5,73,758.44 కోట్ల వద్ద స్థిర పడింది. గత వారం ట్ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ నిలిచాయి.