Reliance_Adani Green | ఓన్లీ రిలయన్స్.. అదానీ గ్రీన్ పైపైకి.. మిగతా 8 సంస్థలు లాస్
Reliance_Adani Green | గతవారం రిలయన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ మినహా టాప్ 8 సంస్థలు రూ.2.21 లక్షల కోట్ల ఎం-క్యాప్ కోల్పోయాయి.
Reliance_Adani Green | గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈలో టాప్-10 సంస్థల్లో ఎనిమిది రూ.2,21,555.61 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,141.78 (1.95 శాతం) పాయింట్లు పతనమైంది. టాప్ 10 బ్లూ చిప్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు మాత్రం లబ్ధి పొందాయి.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,548.8 కోట్లు కోల్పోయి రూ.6,67,062.55 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.60,536.97 కోట్లు నష్టపోయి రూ.7,51,801.60 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,127.49 కోట్లు పతనమై రూ.4,05,723.51 కోట్లకు చేరుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.18,094.01 కోట్ల నష్టంతో రూ.13,21,594.47 కోట్ల వద్ద నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,261.09 కోట్లు కోల్పోయి రూ.4,46,587.56 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.13,264.96 కోట్లు పతనమై రూ.4,30,420.83 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,376.97 కోట్లు నష్టపోయి రూ.5,19,362.62 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) రూ. 5,345.32 కోట్లు కోల్పోవడంతో దాని ఎం-క్యాప్ రూ. 5,00,392.45 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,39,357.52 కోట్లు పెరిగి రూ.18,66,071.57 కోట్లకు దూసుకెళ్లింది. అదానీ గ్రీన్ ఎం-క్యాప్ రూ.3,698.89 కోట్లు లాభ పడి రూ.4,51,749.88 కోట్ల వద్ద నిలిచింది. భారీగా షేర్ నష్టపోవడంతో హౌసింగ్ పైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ.. టాప్-10 కంపెనీల జాబితాకు దూరమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

