కిమ్స్‌లో యూబీ సమ్మిట్
వెన్నెముక సమస్యల చికిత్సలో అత్యాధునిక ఎండోస్కోపీ విధానాలు, నూతన సాంకేతికతలపై వైద్యులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో శనివారం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో ‘హైదరాబాద్ యూబీ సమ్మిట్-2026’ నిర్వహించారు.
-
ఆధునిక స్పైన్ సర్జరీలపై జాతీయ స్థాయి సదస్సు
-
దేశ, విదేశాల నుంచి ప్రముఖ స్పైన్ సర్జన్లు హాజరు
బేగంపేట, నవంబర్ 2: వెన్నెముక సమస్యల చికిత్సలో అత్యాధునిక ఎండోస్కోపీ విధానాలు, నూతన సాంకేతికతలపై వైద్యులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో శనివారం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో ‘హైదరాబాద్ యూబీ సమ్మిట్-2026’ నిర్వహించారు. యువ వైద్యుల్లో ఆధునిక శస్త్ర చికిత్సా నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు వైద్యుల మధ్య విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేశ్ చీకట్ల తెలిపారు.
ఈ సదస్సులో భాగంగా నడుము, డిస్క్, వెన్నెముక, మెడ సమస్యలకు సంబంధించిన ప్రత్యక్ష శస్త్ర చికిత్సలను ప్రదర్శించడంతోపాటు వివిధ రకాల ఆధునిక చికిత్సా పరికరాల వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు, దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ స్పైన్ సర్జన్లు, ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ నిపుణలు, పీజీ వైద్య విద్యార్థులు, ఫెలోస్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

