ఒప్పందాలు సరే.. పెట్టుబడులేవి?
హైదరాబాద్ శివారులో ప్రతిపాదిత ‘ఫ్యూచర్ సిటీ’ వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'.. ప్రచార ఆర్భాటాలకే పరిమితమని, రేవంత్‌రెడ్డి సరార్ చేస్తున్న పెట్టుబడుల ప్రచారం అంతా పచ్చి డొల్ల అని ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
- ప్రకటనలకే పరిమితమైన పరిశ్రమల స్థాపన
- రేవంత్ సరార్ గత ఎంవోయూలపై సందేహాలు
- మరోసారి హైదరాబాద్‌లో ‘గ్లోబల్ సమ్మిట్’ ఆర్భాటం
- ‘ఇన్వెస్ట్ తెలంగాణ’పై వెల్లువెత్తుతున్న విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులో ప్రతిపాదిత ‘ఫ్యూచర్ సిటీ’ వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’.. ప్రచార ఆర్భాటాలకే పరిమితమని, రేవంత్‌రెడ్డి సరార్ చేస్తున్న పెట్టుబడుల ప్రచారం అంతా పచ్చి డొల్ల అని ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రేవంత్‌రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కేవలం రాజకీయ సంబంధాల కోసమే తప్ప.. గ్రౌండ్లో వాస్తవ రూపం దాల్చే పరిస్థితులేవీ లేవనే విమర్శలున్నాయి.
కాగితాలపైనే లెకలు
దావోస్ వేదికగా రూ.1.79 లక్షల కోట్లు, అమెరికా-కొరియా పర్యటనల ద్వారా మరో రూ.31,500 కోట్లు అంటూ కాగితాలపై చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి తీసుకురాలేదని నిపుణులు నిలదీస్తున్నారు. కేవలం లక్ష రూపాయల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న షెల్ కంపెనీలతో రూ.345 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో ఎత్తిచూపుతున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల ను రాష్ట్రానికి తెచ్చామంటూ ఫొటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప.. వాటితో రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు లభించాయో ప్రభుత్వం ఇప్పటివరకు శ్వేతపత్రం విడుదల చేయకపోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తున్నది.
పైసలు వృథా-ప్రయోజనం శూన్యం
ప్రజాధనాన్ని కోట్ల రూపాయల్లో వెచ్చించి సీఎం, మంత్రులు, అధికారుల బృందాలు విదేశాలకు చకర్లు కొట్టడం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, కేవలం అదో లగ్జరీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మారిపోయిందని విమర్శకులు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ పేరిట వచ్చే నెలలో నిర్వహించే సమ్మిట్‌ను సైతం మరో భారీ ప్రజాధన వృథా కార్యక్రమంగానే అభివర్ణిస్తున్నారు. అసలు మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు లేనిచోట ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట గ్రాఫిక్స్ ప్రజెంటేషన్లు చూపిస్తూ జాతీయస్థాయి నాయకులను పిలువడం.. ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడేనని మండిపడుతున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ వంటి ప్రాథమిక హామీల అమల్లో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికే ఈ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రహసనాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్న వేళ.. ఇలాంటి సదస్సుల పేరిట కోట్ల రూపాయల ప్రచార ఖర్చులు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శిస్తున్నారు.
మూడేండ్లుగా ఒక్క ప్రాజెక్టూ మొదలు కాలేదు
అసెంబ్లీ ఎన్నికల ముందు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కొలువులిస్తామని ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారం చేపట్టి మూడేండ్లు కావస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేకపోయారని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయిప్పుడు. ఐటీ కారిడార్లలో నియామకాలు మందగించడం, పారిశ్రామిక వాడల్లో కొత్త యూనిట్లు రాకపోవడం సరార్ వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడంలో చిత్తశుద్ధి చూపకపోతే ప్రజలు ఈ అంకెల గారడీని ఎంతమాత్రం నమ్మే పరిస్థితి లేదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు గండి
కొత్త పరిశ్రమలను ఆహ్వానించాల్సింది పోయి, రేవంత్ సరార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్, వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైడ్రా చేపట్టిన విచక్షణారహిత కూల్చివేతల వల్ల నిర్మాణ రంగంలో లావాదేవీలు 40 శాతానికి పైగా పడిపోయాయని, ఇది నగరంలో పెట్టుబడుల వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల సబ్సిడీలు, ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉండటంతో వారు తమ విస్తరణ ప్రణాళికలను పకనపెట్టి ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు.
,
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

