జీవో 14ను రద్దు చేయాల్సిందే
బీసీ ఆత్మగౌరవ భవనాలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని కల్పించేలా కుట్రపూరితంగా తీసుకొచ్చిన జీవో 14ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఇతర నేతలు డిమాండ్ చేశారు.
-
లేదంటే బీసీ వర్గాల ఆగ్రహం తప్పదు
-
ఆత్మగౌరవ భవనాలపై పెత్తనమేంది?
-
కుట్రపూరితంగా తీసుకొచ్చిన సర్కార్
-
కులసంఘాల ట్రస్టులకే స్వేచ్ఛ కావాలి
-
మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్,
-
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య
ఖైరతాబాద్, నవంబర్ 7: బీసీ ఆత్మగౌరవ భవనాలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని కల్పించేలా కుట్రపూరితంగా తీసుకొచ్చిన జీవో 14ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఇతర నేతలు డిమాండ్ చేశారు. లేదంటే బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో జీవో-14 అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హాజరైన 42 కులసంఘాల నాయకులు ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జీవో 14ను తీసుకొచ్చిందని విమర్శించారు. బడుగుల ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వం పెత్తనమేందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని నగరంలో బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం సుమారు రూ.200 కోట్ల మార్కెట్ విలువైన 82 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఆయా కులసంఘాల భవనాల కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.92.5 కోట్లతో పనులు చేపట్టినట్టు వివరించారు. మరో రూ.95 కోట్లు విడుదల చేసి నిర్మాణ పనులను ఈ ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భవనాల నిర్వహణ విషయంలో కుల సంఘాల ట్రస్టులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని కోరారు. ప్రభుత్వం అనుమతులు, నిబంధనలు విధించడం సరికాదని హితవు పలికారు. ఆ భూములు, భవనాలపై ఆయా సంఘాల ట్రస్ట్‌లకే శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు. అవకతవకలు జరిగితే బాధ్యులపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి తప్ప.. కుల సంఘాల హక్కులను హరించవద్దని కోరారు. బీసీ కులాలపై వివక్ష చూపితే సామాజిక అసమానతలు పెరిగి ఉద్యమాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేయాలి: బడుగుల
అగ్రవర్ణ ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేయాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీలకు అత్యున్నత రాజకీయ పదవులు, కీలక బాధ్యతలు దక్కాయని పేర్కొన్నారు. కుల సంఘాలను ప్రభుత్వాలు గౌరవించాలని, కానీ, పెత్తనం చెలాయించాలని చూడటం సరికాదని హితవు పలికారు. కులసంఘాల ట్రస్టులకే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించాలని కోరారు. బీసీల హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్‌గౌడ్, ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, కార్మిక నేత రాంబాబుయాదవ్, నారాయణ, వడ్డెర సంఘం నేత వేముల రామకృష్ణ, సర్పంచుల జేఏసీ చైర్మన్ సూర్వి యాదయ్య, చందర్, కుమార్‌గౌడ్, చెన్నయ్య, కృష్ణయ్యగౌడ్, నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
బీసీలపై సర్కార్ కర్రపెత్తనమేంది: ఉపేంద్ర
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ):బీసీ వ్యతిరేక జీవో 14ను వెంటనే రద్దుచేయాలని బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్ర ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే బలహీనవర్గాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీసీల అభ్యున్నతి కోసం మంజూరు చేసిన ఆత్మగౌరవ భవనాలపై రేవంత్ ప్రభుత్వం కర్రపెత్తనం చేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే జీవో 14ను జారీ చేసిందని మండిపడ్డారు. బీసీలు సమావేశాలు పెట్టుకొనేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

