Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,71,309.28 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా లాభ పడ్డాయి. మిగతా ఆరు సంస్థల్లో మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది. రిలయన్స్తోపాటు టాప్-10లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.78,127.48 కోట్లు నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 596.87 పాయింట్ల లబ్ధి పొందింది. ఈ నెల నాలుగో తేదీన సెన్సెక్స్ జీవిత కాల గరిష్టం 74,501.73 పాయింట్లకు చేరుకుంది.
టాప్-10లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నష్టపోయాయి. మరోవైపు రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందూస్థానీ యూనీ లివర్ (హెచ్ యూఎల్) ఎం-క్యాప్ నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.76,880.74 కోట్లు పెరిగి రూ.11,77,065,34 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.49,208 కోట్లు పుంజుకుని రూ.6,27,692.77 కోట్ల వద్ద ముగిసింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,733.64 కోట్లు పుంజుకుని రూ.14,39,836.02 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.10,486.42 కోట్లు పెరిగి రూ.6,82,152.71 కోట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,462.95 కోట్లు నష్టపోయి రూ.19,75,547.68 కోట్ల వద్ద స్థిర పడింది. భారత్ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.21,206.58 కోట్ల పతనంతో రూ.6,73,831.90 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.9,458.25 కోట్లు నష్టపోయి రూ.7,60,084.40 కోట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,996.54 కోట్ల పతనంతో రూ.6,14,120.84 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.873.93 కోట్ల నష్టంతో రూ.5,34,158.81 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.129.23 కోట్ల నష్టంతో రూ.5,32,816.81 కోట్ల వద్ద ముగిసింది.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్, ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నిలిచాయి.