Max Freedom | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. టెలికం సంస్థలు స్పెషల్ ప్రీ-పెయిడ్ ప్లాన్లు అమలు చేస్తున్నాయి. వివిధ వస్తువుల రిటైల్ షోరూమ్స్, బట్టలు, ఫుట్ వేర్ దుకాణాలు.. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు కూడా స్పెషల్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఆ బాటలో మ్యాక్స్ ఫ్యాషన్ వచ్చి చేరింది.
మ్యాక్స్ ఫ్యాషన్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం మ్యాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడం ఫెస్టివల్ ప్రారంభించింది. ఈ నెల 11 (శుక్రవారం) నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్స్ ఈ నెల 15 వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్లు అన్ని మ్యాక్స్ షోరూమ్‌ల్లో లభిస్తాయి. సెలెక్టెడ్ రేంజ్ ఉత్పత్తుల్లో ఒకటి కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చు. రాయితీ ఆఫర్లతో మీ వార్డ్రోబ్ అప్‌గ్రేడ్ చేయడంలో థ్రిల్‌ను అనుభవించాలంటూ మ్యాక్స్ ఫ్యాషన్స్ కోరింది. కనుక ఫ్రీడం షాపింగ్ ఫెస్టివల్లో లభించే అద్భుతాలను మిస్ కావద్దని సూచించింది.