హైదరాబాద్, సెప్టెంబర్ 23: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ మ్యాటర్.. తెలంగాణలో యూనిట్‌ను తెరిచే అవకాశం ఉన్నదని మ్యాటర్ గ్రూపు ఫౌండర్, సీటీవో కుమార్ ప్రసాద్ తెలికపల్లి తెలిపారు. రాష్ట్ర మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ మాడల్ ఎరా 5000+ మాడల్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ఈవీలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడే యూనిట్‌ను తెరిచే ఆలోచన ఉన్నదని, దీనిపై ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
వ్యాపార విస్తరణకోసం ఇప్పటి వరకు రూ.1,780 కోట్ల నిధులను సేకరించినట్టు, వచ్చే ఏడాది మరో 200 మిలియన్ డాలర్లను సేకరించాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 డీలర్లు ఉండగా, తెలంగాణలో తన తొలి అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
త్వరలో ఖమ్మంలో ప్రారంభించబోతున్నది. దేశీయ చరిత్రలో తొలిసారిగా లైఫ్‌టైం బ్యాటరీ వ్యారెంటీతో ఈ రెండు మాడళ్లను కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1,93,826గా నిర్ణయించింది. 5కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 172 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.